● ఆధ్యాత్మికత విరిసే
● కడలి ఎగసే..
చినవలసల గ్రామ దేవత శ్రీమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. తొలిరోజు అమ్మవారిని, గన్నిపోతురాజు స్వామిని ఊరేగింపుగా తీసుకువెళ్లి నదీ స్నానం చేయించారు. ఈ వేడుకకు ఊరంతా కదలివచ్చింది. యువకులు, మహిళలు నృత్యాలు చేశారు. నదీస్నానం అనంతరం ఉత్సవమూర్తులను తిరిగి ఆలయంలోకి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు జరిపారు. – తాళ్లరేవు
ఓడలరేవు తీరం అల్లకల్లోలంగా మారింది. బుధవారం అమావాస్య కావడంతో ఆ ప్రభావం కారణంగా గురువారం తెల్లవారుజాము నుంచి ఉవ్వెత్తున అలలు ఎగసిపడి తీరం కోతకు గురైంది. సముద్ర రిసార్ట్స్ భవనం ప్రహరీ పడిపోయింది. రిసార్ట్స్‌కు ఆనుకుని ఉన్న రొయ్యల చెరువుకు గండి పడింది. తీరానికి రక్షణ వలయంగా ఉన్న తాటిచెట్లు కడలిలో కలసిపోయాయి. –అల్లవరం


