ఆధారం లేకపోతే.. ఓటుపై వేటు | - | Sakshi
Sakshi News home page

ఆధారం లేకపోతే.. ఓటుపై వేటు

Aug 15 2026 12:22 AM | Updated on Aug 15 2026 12:22 AM

57,902 మంది ఓటర్లకు నోటీసులు

వచ్చే నెల 28లోగా ఆధారాలు చూపాలంటున్న అధికారులు

లేకుంటే ఆ ఓట్లు రద్దు

అంబాజీపేట: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా జిల్లాలో వేలాది మంది ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం జిల్లావ్యాప్తంగా 1,514 పోలింగ్‌ బూత్‌లలో 12,11,266 మంది ఓటర్లున్నారు. వీరిలో 57,902 మంది ఓటర్ల దరఖాస్తులలో పలు లోపాలను అధికారులు గుర్తించారు. తగిన ధ్రువపత్రాలు లేకపోవడం, పేర్లలో తప్పులు, చిరునామా మార్పులు, ఆధార్‌ లోపాలు, రెండుచోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం, వలసల వంటి కారణాలతో వారికి బూత్‌ లెవెల్‌ అధికారులు (బీఎల్‌ఓ) నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న వారు వచ్చే నెల 28వ తేదీలోగా సంబంధిత ఆధారాలను తహసీల్దార్‌, ఎంపీడీఓ కార్యాలయాల్లో అందజేయాలి. గడువులోగా స్పందించకపోతే వారి ఓటు హక్కుపై వేటు పడుతుందని అధికారులు చెబుతున్నారు. నోటీసులు అందుకున్న వారు ఆయా అధికారుల వద్దకు వెళ్లి గంటల తరబడి నిరీక్షించడం వలన గందరగోళం తప్ప ప్రయోజనం ఉండదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. దీనికి బదులు ఏఈఆర్‌ఓలతో కలసి బీఎల్‌ఓలే నేరుగా ఇళ్లకు వచ్చి విచారణ జరిపితే ఈ ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని పలువురు సూచిస్తున్నారు. అయితే, కార్యాలయాలకు రాలేని వృద్ధులు, దివ్యాంగులు, బాలింతలు, గర్భిణులు తదితరుల ఇళ్లకు సంబంధిత ఏఈఆర్‌ఓ, బీఎల్‌ఓలు వెళ్లి తనిఖీ చేస్తారని అంబాజీపేట తహసీల్దార్‌ బి.చినబాబు తెలిపారు.

మండలాల వారీగా ఓటర్లకు ఇచ్చిన

నోటీసుల వివరాలు

రామచంద్రపురం అర్బన్‌ 123

రామచంద్రపురం రూరల్‌ 201

కాజులూరు 176

కె.గంగవరం 385

ముమ్మిడివరం రూరల్‌ 1,475

ముమ్మిడివరం అర్బన్‌ 406

కాట్రేనికోన 932

ఐ.పోలవరం 4,234

తాళ్లరేవు 96

అమలాపురం రూరల్‌ 3,189

అమలాపురం అర్బన్‌ 4,049

అల్లవరం 3,584

ఉప్పలగుప్తం 1,325

సఖినేటిపల్లి 707

మలికిపురం 5,933

రాజోలు 6,649

మామిడికుదురు 1,905

పి.గన్నవరం 734

అంబాజీపేట 611

అయినవిల్లి 1,713

ఆత్రేయపురం 4,318

రావులపాలెం 4,439

కొత్తపేట 5,505

ఆలమూరు 4,583

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement