జగన్‌ వెంట జనవాహిని | - | Sakshi
Sakshi News home page

జగన్‌ వెంట జనవాహిని

Aug 6 2026 2:32 AM | Updated on Aug 6 2026 2:32 AM

ఆంక్షల వలయాన్ని

దాటిన అభిమానం

పొగాకు రైతులకు మద్దతుగా రైతుపోరులో పాల్గొనేందుకు బుధవారం ఉదయం 7 గంటల నుంచే యువత, అభిమానులు, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు దేవరపల్లి బయలుదేరారు. వారు ఏలూరు, రాజమహేంద్రవరం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు నుంచి దేవరపల్లికి చేరుకునే అన్ని మార్గాల్లోనూ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హెలిప్యాడ్‌, పొగాకు వేలం కేంద్రం వద్దకు వెళ్లకుండా అందరినీ ఊరి పొలిమేరల్లోనే అడ్డుకున్నారు. అయినప్పటికీ ప్రజలు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. పొలాలు, తోటల్లోని మార్గాల ద్వారా దేవరపల్లి జంక్షన్‌కు చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు భద్రత కల్పించడంలో విఫలమైన పోలీసులు.. ఆయన పర్యటనకు తరలివచ్చే వారిని అడ్డుకోవడంలో అత్యుత్సాహం చూపించారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫ బుధవారం ఉదయం 9 గంటలకే దేవరపల్లిలోని హెలిప్యాడ్‌ ప్రాంతం, బస్టాండ్‌, వై జంక్షన్‌, పొగాకు వేలం కేంద్రం జనసంద్రంగా మారాయి.

ఫ ఉదయం 10:30 గంటలకు వైఎస్‌ జగన్‌ హెలికాప్టర్‌లో హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అభిమాన నేతను చూడగానే అందరూ ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.

ఫ ఉదయం 11 గంటలకు బస్టాండ్‌ వద్దకు ర్యాలీ చేరుకోగానే వైఎస్సార్‌ సీపీ

నాయకులు భారీ గజమాలతో

జగన్‌ను సత్కరించారు.

ఫ 12 గంటలకు వై జంక్షన్‌కు చేరుకోగా.. ఓ కార్యకర్త ఉప్పొంగిన అభిమానంతో కారుపైకి చేరుకుని చొక్కా విప్పి.. జగన్‌తో కరచాలనం చేశారు.

ఫ ప్రేమతో ఓ అభిమాని అందించిన వాటర్‌ బాటిల్‌ తీసుకుని జగన్‌ మంచినీరు తాగారు.

ఫ ఓ యువతి జగన్‌ 2.0 అంటూ

ప్రదర్శించిన ఫొటో ఆకట్టుకుంది.

ఫ ఒంటరిగా ఎమ్మెల్యే.. ఒంటరిగా ఎంపీ.. ఒంటరిగా సీఎం.. అంటూ అభిమానులు ప్రదర్శించిన ప్లకార్డు విశేషంగా

ఆకట్టుకుంది.

ఫ జగన్‌ను కన్నులారా చూసేందుకు పొగాకు వేలం కేంద్రం చుట్టూ ఉన్న భవనాల పైకి మహిళలు, యువత చేరుకుని మండుటెండలో నిరీక్షించారు.

ఫ జగన్‌ ప్రసంగం సాగినంతసేపూ సీఎం.. సీఎం.. అనే నినాదాలు మిన్నంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement