సరిహద్దులు దాటిన క్రేజ్‌ | - | Sakshi
Sakshi News home page

సరిహద్దులు దాటిన క్రేజ్‌

Aug 6 2026 2:26 AM | Updated on Aug 6 2026 2:26 AM

నిడదవోలు రూరల్‌/చాగల్లు: రాష్ట్రాలకు సరిహద్దులున్నా.. ప్రజాదరణ ముందు అవన్నీ తల వంచాల్సిందేనని ఖమ్మం యువకులు నిరూపించారు. వైఎస్‌ జగన్‌ దేవరపల్లి పర్యటనలో ఖమ్మం నుంచి ప్రత్యేకంగా వచ్చిన యువకులు దాసరి మధు, రాజేష్‌, అరుణ్‌, రఘు సందడి చేశారు. వైఎస్‌ జగన్‌, కేటీఆర్‌, తమిళనాడు సీఎం దళపతి విజయ్‌ ఫొటోలతో.. ‘జన నాయకులు’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ, దేవరపల్లిలో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల ప్రజల దశాబ్దాల కలను నిజం చేస్తూ.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి జగన్‌ ఘనతే కారణమని చెప్పారు. జగన్‌ సీఎంగా ఉన్నప్పుడే భూసేకరణ చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ఈ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకువెళ్లారని, అందువల్లనే ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ అభిమాన నేతకు కృతజ్ఞతలు చెప్పేందుకే ఇక్కడకు వచ్చామంటూ ఆ యువకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

ఫ దేవరపల్లి – ఖమ్మం

గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే జగన్‌ ఘనతే

ఫ కృతజ్ఞత చాటుకునేందుకు

వచ్చిన ఖమ్మం యువత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement