గల్లంతైన మత్స్యకారుడి మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గల్లంతైన మత్స్యకారుడి మృతదేహం లభ్యం

Aug 6 2026 12:39 AM | Updated on Aug 6 2026 12:39 AM

కాకినాడ రూరల్‌: సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుడు ఓసుపల్లి అనిల్‌కుమార్‌ (26) మృతదేహం గురువారం ఉదయం లభ్యమైంది. మండలంలోని సూర్యారావుపేట గ్రామానికి చెందిన అనిల్‌కుమార్‌ మరో ఐదుగురితో ఈ నెల 2న చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా వాకలపూడి ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలో సముద్రంలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. గురువారం ఉదయం చేపల వేటకు వెళుతున్న మత్స్యకారులకు సూర్యారావుపేట – ఉప్పాడ మధ్య స్పెక్ట్రామ్‌ ఎదురుగా అనిల్‌కుమార్‌ మృతదేహం తేలియాడుతూ కనపడింది. ఈ మేరకు అతడి సమాచారాన్ని అతడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలియజేశారు. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చాక సర్పవరం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement