గోకవరం: మండలం గుమ్మళ్లదొడ్డి వద్ద బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే స్థానిక ఆర్టీసీ డిపోకు చెందిన సింగిల్‌స్టాప్ బస్సు ఉదయం రాజమమహేంద్రవరం నుంచి గోకవరం వస్తుండగా గుమ్మళ్లదొడ్డిలో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న రంపయర్రంపాలేనికి చెందిన కాళ్ల వీరవెంకట సత్యనారాయణ (50) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై నాగమణి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆమెతెలిపారు.


