కౌలు చెల్లించలేని పరిస్థితి | - | Sakshi
Sakshi News home page

కౌలు చెల్లించలేని పరిస్థితి

Aug 6 2026 2:26 AM | Updated on Aug 6 2026 2:26 AM

నాణ్యమైన పొగాకును కూడా గేడ్రింగ్‌ పేరిట దోచుకుంటున్నారు. కనిష్ట ధర రూ.170కే ఎక్కువ సరకు కొంటున్నారు. సగటు ధర రూ.230 మాత్రమే చెల్లిస్తున్నారు. కౌలు రైతులయితే పెట్టుబడి తీసేసి.. కౌలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికై నా గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలి.

– కూచిపూడి గంగాధరరావు, పల్లంట్ల, దేవరపల్లి మండలం

గరిష్ట ధర నిర్ణయించాలి

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో కిలో పొగాకును గరిష్టంగా రూ.385కు కొనుగోలు చేశారు. ప్రస్తుతం కిలో రూ.270 దాటడం లేదు. ఆ ధరకు కూడా చాలా తక్కువ సరకే కొనుగోలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే గరిష్ట ధర నిర్ణయించి, ఆ రేటుకు మాత్రమే కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది.

– మద్దిపాటి శ్రీనివాసరావు, పల్లంట్ల, దేవరపల్లి మండలం

చంద్రబాబు ప్రభుత్వంలో నష్టమే..

చంద్రబాబు పాలనలో రైతులకు ఎప్పుడూ నష్టమే. ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కక అన్నదాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి కూడా దక్కని దుస్థితి నెలకొంది. పొగాకు రైతులను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడమే లేదు. వైఎస్‌ జగన్‌ పాలనలోనే మేలు జరిగింది.

– సుంకర రాంబాబు, వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు, దేవరపల్లి

కిలోకు రూ.50 పెంచాలి

ప్రస్తుతం నాణ్యమైన పొగాకును కూడా కిలో రూ.170 నుంచి రూ.260 మధ్య కొనుగోలు చేస్తున్నారు. గ్రేడింగ్‌ పేరిట అన్యాయం చేస్తున్నారు. ప్రస్తుత గరిష్ట ధరకు అదనంగా ప్రతి కిలోపై రూ.50 ప్రభుత్వమే చెల్లించాలి. అప్పుడే మాకు కొంతలోకొంత గిట్టుబాటవుతుంది.

– ఉండవల్లి రామారావు, రామన్నపాలెం, దేవరపల్లి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement