యువకుడి దారుణ హత్య.. కారుతో తొక్కించి చంపిన స్నేహితుడు | - | Sakshi
Sakshi News home page

నువ్వు ఊరిలో లేనప్పుడు నీ పెళ్లాం, పిల్లల పీకలు కోస్తా..

May 29 2023 11:22 AM | Updated on May 29 2023 11:36 AM

- - Sakshi

ఏలేశ్వరం: స్నేహితుడే కాలయముడయ్యాడు. నిత్యం కలిసి తిరుగుతూ ఉన్న స్నేహితుడే కారుతో తొక్కించి కర్కశంగా తుది ముట్టించిన ఘటన ఆదివారం పట్టణంలో జరిగింది. ఈ ఘటనలో పట్టణానికి చెందిన కోరాడ మణికంఠ(23) మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం పట్టణానికి చెందిన కోరాడ మణికంఠ, బంటు దుర్గాప్రసాద్‌ స్నేహితులు. అర్ధరాత్రి 11, 12 గంటల మధ్య దుర్గాప్రసాద్‌ కారులో మణికంఠను బయటికి తీసుకువెళ్లాడు.

ఎంతసేపైనా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి తెల్లవారుజామున నాలుగు గంటలకు మణికంఠ తండ్రి శ్రీనివాసరావు బంధువులతో కలిసి వెతికాడు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్దకు రాగా కారులో బయటకు వస్తున్న దుర్గాప్రసాద్‌ను నిలదీశారు. దీంతో మణికంఠ తన తాతను తిట్టాడని దీనిపై నిలదీయగా నువ్వు ఊరిలో లేనప్పుడు నీ పెళ్లాం, పిల్లల పీకలు కోస్తానని చెప్పడంతో కారుతో తొక్కించి చంపేశానని దుర్గాప్రసాద్‌ చెప్పాడు.

దీంతో మృతుడు తండ్రి శ్రీనివాసరావు ిఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా సీఐ కిషోర్‌బాబు, ఎస్సై సతీష్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement