మరమ్మతు చేస్తుండగా కరెంట్‌ సరఫరా | Young Man Passed Away Due To Electric Shock In Nalgonda District | Sakshi
Sakshi News home page

మరమ్మతు చేస్తుండగా కరెంట్‌ సరఫరా

Mar 20 2022 3:48 AM | Updated on Mar 20 2022 8:43 AM

Young Man Passed Away Due To Electric Shock In Nalgonda District - Sakshi

చింతపల్లి : విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. మండల కేంద్రానికి చెందిన యాచారపు కృష్ణ (26) లైన్‌మన్‌ దగ్గర పనిచేస్తూ ఇంటింటికీ వెళ్లి కరెంటు బిల్లులు ఇచ్చేవాడు.

అయితే శనివారం మండల కేంద్రంలోని విద్యుత్‌ అంతరాయం ఏర్పడటంతో లైన్‌మన్‌ కింద ఉండి కృష్ణను విద్యుత్‌ స్తంభంపైకి ఎక్కించాడు. విద్యుత్‌ ఎల్‌సీలో ఉన్నప్పుడు కార్యాలయంలో ఉండే సిబ్బంది కృష్ణ స్తం భం మీద ఉండగానే సరఫరాను పునరుద్ధరించారు. దీంతో కృష్ణ విద్యుదాఘాతానికి గురై స్తంభంపైనే చనిపోయాడు. అధికారుల నిర్లక్ష్యంతోనే మృతిచెం దాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement