యువకుడి పాడుపని.. వివాహిత ఇంటికెళ్లి.. చేయి పట్టుకుని.. | Sakshi
Sakshi News home page

యువకుడి పాడుపని.. వివాహిత ఇంటికెళ్లి.. చేయి పట్టుకుని..

Published Sat, Jun 11 2022 11:10 AM

Young Man Obscene Behavior With Married Woman In Eluru District - Sakshi

ద్వారకా తిరుమల(ఏలూరు జిల్లా): ఒక వివాహితతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ టి.సుధీర్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారకాతిరుమలకు చెందిన ఎ.సురేష్‌ అనే యువకుడు ఈ నెల ఏడో తేదీ మధ్యాహ్నం అదే గ్రామానికి చెందిన ఒక వివాహిత ఇంటికి వెళ్లి, చేయి పట్టుకుని తన కోర్కె తీర్చమని బలవంతపెట్టాడు.
చదవండి: ప్రేమ.. పెళ్లి.. భర్తకు దూరంగా అద్దె ఇంట్లో.. చివరికి ఇలా..

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. గతంలో కూడా సురేష్‌ ఆమెను పలుమార్లు ఇబ్బంది పెట్టినట్టు, ఆ విషయాన్ని పెద్దలకు తెలిపినా ఫలితం లేకపోయిందని ఫిర్యాదులో వెల్లడించినట్టు పేర్కొన్నారు. 

 
Advertisement
 
Advertisement