ప్రేమ.. పెళ్లి.. భర్తకు దూరంగా అద్దె ఇంట్లో.. చివరికి ఇలా..

Conflict With Husband: Married Woman Commits Suicide In Krishna District - Sakshi

కోనేరుసెంటర్‌ (మచిలీపట్నం)/కృష్ణా జిల్లా: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత మనస్తాపం చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘట నపై మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. ఎస్‌ఐ నాగరాజు కథనం మేరకు.. మచిలీపట్నం ఆర్టీసీకాలనీకి చెందిన ముచ్చు స్వర్ణకుమారి (27) విజయవాడకు చెందిన శివన్నారాయణను 2014లో ప్రేమ వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు కుమారులు. కొంతకాలం క్రితం భార్యాభర్తల మధ్య విభే దాలు తలెత్తాయి. స్వర్ణకుమారి భర్తను వదిలి పుట్టింటికి దగ్గరలోని ఆర్టీసీకాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతో జీవిస్తోంది.
చదవండి: ఇష్టం లేని పెళ్లి చేశారని.. ఆ భర్త ఎంత పనిచేశాడంటే?

ఈ నెల ఆరో తేదీన స్వర్ణకుమారి తండ్రి చనిపోయాడు. దీంతో తల్లి ముచ్చు వెంకమ్మ కుమార్తెను తమతో పాటే ఉండాలని ఒత్తిడి చేస్తోంది. అందుకు స్వర్ణకుమారి అంగీకరించకపోవడంతో తల్లీకూతుళ్ల మధ్య గురువారం వాగ్వాదం జరిగింది. మనస్తాపం చెందిన స్వర్ణకుమారి పిల్లలను పుట్టింటిలో ఉంచి తన ఇంటికి వెళ్లింది. మధ్యాహ్నం భోజనం చేసేందుకు తిరిగి రాకపోవటంతో అను మానం వచ్చిన కుటుంబసభ్యులు స్వర్ణకుమారి ఇంటికి వెళ్లారు.

ఆమె ఇంటిలో ఫ్యానుకు ఉరి వేసు కుని వేలాడుతూ కనిపించింది. కిందికి దింపి హుటాహుటిన బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. తల్లి వెంకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శుక్రవారం పోస్టుమార్టం జరిగిన అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగి స్తామని ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top