వివాహేతర సంబంధం వద్దన్నందుకు.. | Young Man Brutally Murdered In Balapur Hyderabad By Armed Group, More Details Inside | Sakshi
Sakshi News home page

Balapur Murder Case: వివాహేతర సంబంధం వద్దన్నందుకు..

Jun 15 2024 1:19 PM | Updated on Jun 15 2024 1:35 PM

Young Man Brutally Murdered In Hyderabad

కత్తితో పొడిచి స్నేహితుడి హత్య  

బాలాపూర్‌ పీఎస్‌ పరిధిలో ఘటన  

పహాడీషరీఫ్‌: ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట హఫీజ్‌బాబానగర్‌కు చెందిన సయ్యద్‌ మునీర్‌ కుమారుడు సయ్యద్‌ సమీర్‌(19), సోహెల్, సోఫియన్‌ స్నేహితులు. 

వీరిలో ఒకరైన సోహెల్‌ ఇదే కాలనీలలో ఉండే ఓ వివాహితతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సమీర్‌.. అందరం ఒకే కాలనీలో ఉంటున్నాం.. నాకు కూడా అక్కాచెల్లెళ్లు ఉన్నారు.. ఇలా చేయడం తప్పు అని సోహెల్‌కు సూచించాడు. ఇది జీరి్ణంచుకోలేని అతను సమీర్‌ తనపై దు్రష్పచారం చేస్తున్నాడని భావించాడు. 

ఎలాగైనా అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే గురువారం రాత్రి తన మరో స్నేహితుడు సోఫియన్‌తో కలిసి ముందస్తు పథకంలో భాగంగా.. సమీర్‌ను తీసుకుని బాలాపూర్‌ ఠాణా పరిధిలోని గుర్రం చెరువు ప్రాంతానికి వెళ్లారు. అనంతరం వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో సోహెల్‌ దాడికి పాల్పడ్డాడు. సమీర్‌ ఛాతి, వీపు భాగాల్లో ఐదుసార్లు బలంగా పొడిచాడు. ఈ సమయంలో విరిగిపోయిన కత్తి మృతుడి కడుపులోనే ఉండిపోవడం గమనార్హం. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  

 

Advertisement
 
Advertisement
Advertisement