మద్యానికి బానిసైన కొడుకును మందలించినందుకు... | Young Boy Self Destruction In Adilabad | Sakshi
Sakshi News home page

మద్యానికి బానిసైన కొడుకును మందలించినందుకు...

Aug 27 2021 8:04 AM | Updated on Aug 27 2021 8:04 AM

Young Boy Self Destruction In Adilabad - Sakshi

గణేశ్‌ (ఫైల్‌)

సాక్షి, తానూరు(ఆదిలాబాద్‌): మండలంలోని జౌలా(కే) గ్రామానికి చెందిన దామాన్‌వాడ్‌ గణేశ్‌(18) మద్యానికి బానిసై బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాజన్న తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. గణేశ్‌ గతకొద్ది రోజులుగా మద్యానికి బానిసై ఏ పని చేయకుండా తిరుగుతున్నాడు. బుధవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి రావడంతో తల్లి రుక్మాబాయి మందలించింది. మనస్థాపానికి గురైన గణేశ్‌ అర్ధరాత్రి ఇంట్లోనే దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

గురువారం ఉదయం తల్లి రుక్మాబాయి  చూసేసరికి దూలానికి వెలాడుతూ కనిపించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తల్లి రుక్మాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజన్న తెలిపారు. 

చదవండి: తల్లి, కుమార్తెపై లైంగిక వేధింపులు 

Advertisement
 
Advertisement
Advertisement