తల్లి, కుమార్తెపై లైంగిక వేధింపులు  | BJP Leader Molested Mother And Daughter In Tamilnadu | Sakshi
Sakshi News home page

తల్లి, కుమార్తెపై లైంగిక వేధింపులు 

Aug 27 2021 7:30 AM | Updated on Aug 27 2021 7:33 AM

BJP Leader Molested Mother And Daughter In Tamilnadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు: చెన్నై కొడుంగయూరులో తల్లి, కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడిన పెరంబూరు వెస్ట్‌ మండల బీజేపీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చెన్నై కొడుంగయూరు ప్రాంతానికి చెందిన పార్థసారథి (56). ఇతను పెరంబూరు మండల బీజేపీ నేత.  ఇతను తన ఇంటికి సమీపంలో ఉన్న తల్లి, కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు చెన్నై పోలీసు కమిషనర్‌ కార్యాలయానికి ఫిర్యాదు అందింది. కొడుంగయూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో పార్థసారథి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో స్నేహితుడి ఇంటిలో ఉన్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు బుధవారం రాత్రి నిందితుడిన అరెస్టు చేశారు. 

వ్యాయామ ఉపాధ్యాయుడికి 14 ఏళ్లు జైలు 
నెల్‌లై జిల్లా రాధాపురం తాలూకా శివజ్ఞానపురంలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న తమిళ్‌సెల్వన్‌ (48). ఇతను 2018 సంవత్సరం కబడ్డీ పోటీలకు వచ్చిన ఓ విద్యార్థిని కిడ్నాప్‌ చేసి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతో రాజపాళయం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ కేసుపై విచారణ శ్రీ వల్లిపుత్తూరు జిల్లా ఫోక్సోకోర్టులో గురువారం జరిగింది. నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి ధనశేఖర్‌ నిందితుడికి 14 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement