లాడ్జీలో 10 మంది అమ్మాయిలతో వ్యభిచారం.. | Women Caught In Prostitution | Sakshi
Sakshi News home page

లాడ్జీలో 10 మంది అమ్మాయిలతో వ్యభిచారం.. డీఎంకే నేతపై కేసు

Sep 26 2026 12:29 PM | Updated on Sep 26 2026 12:39 PM

Women Caught In Prostitution

తమిళనాడు: లాడ్జిలో వ్యభిచారం నిర్వహి స్తూ పట్టుబడిన డీఎంకే నాయకుడిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. తంజావూరు జిల్లా కుంభకోణం నాగేశ్వరన్‌ కోవిల్, రామసామి కోవిల్‌ సమీపంలోని వివిధ లాడ్జీలు, బ్యూటీ పార్లర్లలో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. పోలీసులు జరిపిన సోదాల్లో 10 మంది మహిళలను రక్షించి హోమ్‌కు తరలించారు. నలుగురు విటు లను అరెస్ట్‌ చేశారు. 

మరికొందరి కోసం గాలిస్తున్నారు. ప్రైవేట్‌ లాడ్జి యజమాని, తంజావూరు ఉత్తర జిల్లా డీఎంకే ఇంజినీరింగ్‌ విభాగం నాయకుడు రాజా రఘుపతి, మరి కొందరిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో రాజా రఘుపతిని పార్టీ నుంచి బహిష్కరించారు. రాజా రఘుపతి పార్టీకి కళంకం తెచ్చేలా ప్రవర్తించినందున, అతనిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని పదవుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు డీఎంకే  ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ ప్రకటించారు.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement