కిలేడీ.. మేకప్‌ వేసుకుంటే కనుక్కోలేం!.. | Woman Steals Gold From Owners House In Mumbai | Sakshi
Sakshi News home page

డబ్బంటే ప్రేమ.. లగ్జరీ లైఫ్‌ కోసం.. 

Feb 27 2021 6:42 PM | Updated on Feb 27 2021 7:14 PM

Woman Steals Gold From Owners House In Mumbai - Sakshi

శీతల్‌ ఉపాద్యాయ్‌ మేకప్‌కు ముందు, ఆ తర్వాత

ఆ సమయంలో ఆమె అందంగా తయారవుతుందని, మేకప్‌లో ఉన్నపుడు ఆమెను...

ముంబై : విలాసవంతమైన జీవితం అనుభవించాలన్న కోరికతో ఓ మహిళ పెడదారి పట్టింది. అన్నం పెట్టిన ఇళ్లకు కన్నాలు వేస్తూ జైలు పాలైంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, కుర్లాకు చెందిన 32ఏళ్ల శీతల్‌ ఉపాద్యాయ్‌కి డబ్బంటే విపరీతమైన ప్రేమ.. దాని ద్వారా విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే కోరిక. అయితే ఆమె సంపాదన రోజు గడవటానికే తప్ప తనకు విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వలేకపోయేది. దీంతో డబ్బున్న వారి ఇళ్లలో పని మనిషిగా చేరి, డబ్బు, నగలు దొంగిలించేది. తాజాగా అంధేరిలోని 80 ఏళ్ల వృద్ధురాలి ఇంట్లో పనికి చేరి నగల్ని తష్కరించింది. 500 గ్రాముల ఆ బంగారు నగల విలువ 13 లక్షల రూపాయలు ఉంటుంది. దొంగిలించిన నగలతో స్నేహితుల కోసం విచ్చల విడిగా డబ్బు ఖర్చు చేయసాగింది.

ఒకసారి రెస్టారెంట్‌కు వెళితే ఐదునుంచి పది వేల రూపాయలు ఖర్చుపెట్టేది. నగల దొంగతనంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా శీతల్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. ‘‘ సీనియర్‌ సిటిజన్స్‌ ఇళ్లలో పని మనిషిగా చేరి దొంగతనాలు చేసేదని తెలిపారు. పనిలో లేని సమయంలో ఆమె అందంగా తయారవుతుందని, మేకప్‌లో ఉన్నపుడు ఆమెను కనిపెట్టడం చాలా కష్టమన్నారు.

చదవండి : దారుణం: ఎంగిలి పల్లెం విసిరాడని చిన్నాన్నను..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement