Woman Constable Committed Suicide In Hyderabad - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

May 3 2023 7:33 PM | Updated on May 4 2023 5:55 AM

Woman Constable Committed Suicide In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీ ఛత్రినాక పీఎస్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడింది. రెండు రోజుల క్రితమే కానిస్టేబుల్‌ సురేఖకు నిశ్చితార్థం జరిగింది. ఇష్టంలేని పెళ్లి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది.

రంగారెడ్డి జిల్లా కందుకూరుకు చెందిన సురేఖ.. తన సోదరితో కలిసి అలియబాద్ ప్రాంతంలో నివాసం ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న శాలిబండ పోలీసులు.. క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
చదవండి: నీలి చిత్రాల సీడీల నుంచి కిడ్నీ రాకెట్‌ వరకూ..

Advertisement
 
Advertisement
Advertisement