భార్య వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య | Wife And Husband Incident In Karnataka | Sakshi
Sakshi News home page

భార్య వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య

Oct 21 2026 9:43 AM | Updated on Oct 21 2026 10:29 AM

Wife And Husband Incident In Karnataka

బెంగళూరు: భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన అనేకల్‌ తాలూకా నెరిగా గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మునికృష్ణ(35)కు పదేళ్ల  క్రితం మునికృష్ణకు నయన అనే మహిళతో వివాహం జరిగింది. దంపతులకు ఆరు సంవత్సరాల వయసున్న కుమారుడు ఉన్నాడు. 

ప్రస్తుతం నయన గర్భవతి. మునికృష్ణ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నయనకు వరుసకు సోదరుడయ్యే కుమార్‌ అనే వ్యక్తితో  అక్రమ సంబంధం ఏర్పడింది.  నయనతో కలిసి ఉండే అశ్లీల ఫొటోలు, వీడియోలు మునికృష్ణకు కుమార్‌ వాట్సాప్‌ చేసేవాడు. నయన కడుపులో పెరుగుతున్నది తన బిడ్డే అంటూ ఎగతాలి చేసేవాడు. దీంతో మనస్తాపం చెందిన మునికృష్ణ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సర్జాపుర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.    

ఇదీ చదవండి: భారీగా పెరిగిన సన్న బియ్యం ధర..!


 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement