అరిస్తే నీ బిడ్డని విసిరేస్తా.. రైలులో తల్లిపై అత్యాచారం

West Bengal: Woman Molestation Train, Threatened Baby Throw Out - Sakshi

కోల్‌కతా: మహిళల భద్రత విషయంలో ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా, దోషులను శిక్షిస్తున్న వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా చంటిబిడ్డతో కలిసి రైలు ప్రయాణం చేస్తున్న ఓ మహిళపై దారుణానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. అస్సాంలోని గుహవాటి నుంచి పశ్చిమబెంగాల్‌లోని అలీపుర్‌ద్వార్‌ వెళ్లే.. సిఫాంగ్‌ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలీపుర్‌దూర్ జిల్లాకు చెందిన మహిళ శనివారం మధ్యాహ్నం గౌహతిలో రైలు ఎక్కింది. అసోంలోని కోక్రాఝర్‌లో రైలు ఆగిన మూడో చివరి స్టేషన్‌లో కోచ్‌ ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. ఫకీరాగ్రామ్ జంక్షన్ వద్ద కోచ్‌లోని ఇతర ప్రయాణికులు దిగిన తర్వాత ఆ ఇద్దరు తనను కట్టేసి, కొట్టి అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

మరొకరు ఆమె ప్రతిఘటిస్తే నడుస్తున్న రైలులో నుండి తన బిడ్డను బయట విసిరేస్తానని బెదిరించినట్లు తెలిపింది. తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనప్పటికీ ఆ మహిళ ఎలాగోలా అలీపుర్‌దూర్‌ జంక్షన్‌లో రైలు దిగి చిన్నారితో కలిసి అధికారులకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు గంటలలోపే నిందితులను పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. దర్యాప్తు కొనసాగుతోంది, ”అని అలీపుర్‌దువార్ పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top