ప్రేమ వివాహం: తణుకులో సెల్ఫీ సూసైడ్ వీడియో కలకలం.. | Venkatesh Selfie Video Before Suicide in West Godavari | Sakshi
Sakshi News home page

ప్రేమ వివాహం: తణుకులో సెల్ఫీ సూసైడ్ వీడియో కలకలం.. కులం పేరుతో వేధించడంతోనే..

Jan 29 2022 1:06 PM | Updated on Jan 29 2022 2:33 PM

Venkatesh Selfie Video Before Suicide in West Godavari - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని తణుకులో సెల్ఫీ సూసైడ్ వీడియో కలకలం రేపింది. పట్టణానికి చెందిన కొల్లి వెంకటేష్ (26) ఉరి వేసుకుని శనివారం ఆత్మహత్మ చేసుకున్నాడు. అయితే మూడు నెలల క్రితం అతని  భార్య లక్ష్మి తులసి కూడా ఆత్మహత్య చేసుకొంది. వెంకటేష్‌, లక్ష్మి తులసిది ప్రేమ వివాహం. 

ఇద్దరు పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న నేపథ్యంలో కులం తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నావంటూ ఇరుగుపొరుగు వారు తన భార్యను వేధించినట్లు వీడియోలో పేర్కొన్నారు. ఈ విషయంపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సైతం స్పందించలేదని ఆరోపించాడు. ఈ వివాదాలతో పాటు తనకు రూ.7 లక్షలు అప్పు కూడా ఉన్నట్లు వెంకటేష్‌ సూసైడ్‌ నోట్‌లో వివరించాడు.

చదవండి: (శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. భార్య, అత్తను కిరాతకంగా..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement