శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. భార్య, అత్తను కిరాతకంగా..

Wife and Aunt Assassinated by Son in Law at Srikakulam District - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల మండలం ముద్దాడపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ముద్దాడపేట గ్రామానికి చెందిన అప్పన్న అనే వ్యక్తి కత్తితో భార్య, అత్త గొంతుకోసి కిరాతకంగా చంపాడు. అంతేగాక, అడ్డుకోబోయిన మరో ముగ్గురిపైనా కత్తితో దాడి చేశాడు. హత్య అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సాయంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. హత్యలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top