వేలివెన్ను వీఆర్‌ఓపై సస్పెన్షన్‌ వేటు | Velivennu VRO Suspended In East Godavari | Sakshi
Sakshi News home page

వేలివెన్ను వీఆర్‌ఓపై సస్పెన్షన్‌ వేటు

Sep 5 2020 1:25 PM | Updated on Sep 5 2020 2:53 PM

Velivennu VRO Suspended In East Godavari - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: ఉండ్రాజవరం మండలం వేలివెన్నుకు చెందిన వీఆర్‌ఓ సూర్యజ్యోతిని శనివారం అధికారులు సస్పెండ్‌ చేశారు. మండలంలోని సచివాలయంలో ఆమె వీఆర్‌వోగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో జూలై 27న వేలివెన్ను గ్రామానికి చెందిన బూరుగుపల్లి సుబ్బలక్ష్మి అనే మహిళా రైతుకు సంబంధించిన 42 సెంట్ల భూమి మ్యుటేషన్‌ కోసం 42 వేల రూపాయలు లంచం డిమాండ్‌ చేశారు.

తహిసీల్దార్‌కు వీఆర్‌ఓపై ఆమె ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీఆర్‌వో లంచం అడిగినట్టు విచారణలో రుజువు కావడంతో ఆమెను సస్పెండ్‌ చేయాలంటూ నిన్న(శుక్రవారం) కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ ఆయ్యాయి. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇవాళ సూర్యజ్యోతిని అధికారులు సస్పెండ్‌ చేశారు. (కరోనా: ఆఖరు ఘడియల్లో ఆత్మబంధువులు)

Advertisement
 
Advertisement
Advertisement