బెంగళూరు హోటల్లో ఉజ్బెక్‌ మహిళ హత్య | Uzbekistan Woman Found Dead At Bengaluru Hotel | Sakshi
Sakshi News home page

బెంగళూరు హోటల్లో ఉజ్బెక్‌ మహిళ హత్య

Mar 15 2024 6:08 AM | Updated on Mar 15 2024 6:08 AM

Uzbekistan Woman Found Dead At Bengaluru Hotel - Sakshi

బనశంకరి: బెంగళూరులోని ఓ హోటల్‌లో విదేశీ మహిళ హత్యకు గురయ్యారు. శేషాద్రిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి వెలుగుచూసింది. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జరీనా (37) వ్యాపార వీసాపై నాలుగు రోజుల క్రితం బెంగళూరుకు వచ్చారు. బుధవారం మధ్యాహ్నం శేషాద్రిపురంలో ఓ హోటల్‌ రెండో అంతస్తు గదిలో బస చేశారు.

బుధవారం రాత్రి 10:30 గంటలైనా ఆమె బయటకు రాలేదు. అనుమానం వచి్చన హోటల్‌ సిబ్బంది మాస్టర్‌ కీ ద్వారా తెలుపు తెరిచారు. లోపల చూడగా జరీనా విగతజీవిగా కనిపించారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు ఆధారాలు సేకరించి, సీసీ ఫుటేజీ, సెల్‌ కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఎవరో గొంతు నులిమి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement