పెద్దనాన్న అఘాయిత్యం, గర్భం దాల్చిన బాలిక 

Uncle Repeatedly Molestation On 13 Year Old Girl In HYD - Sakshi

కనురెప్పే కాటేసేంది..

అబార్షన్‌ కోసం బేరసారాలు

వత్తాసు పలుకుతున్న ఓ ఎస్‌ఐ 

సాక్షి, జగద్గిరిగుట్ట: వరుసకు పెద్దనాన్న.. తన కూతురు వయస్సున్న ఆ బాలిక(13)పై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కూన మహాలక్ష్మినగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు.. బాధితుల కథనం ప్రకారం... గతేడాది అక్టోబర్‌ 20న ఆ బాలిక టీవీ చూసేందుకు అదే వీధిలో ఉంటున్న పెదనాన్న ఇంటికి వెళ్లింది, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. దీంతో వావి వరసలు మరిచిన పెదనాన్న తన మరదలి కూతురు నోట్లో టవల్‌ కుక్కి లైంగిక దాడికి పాల్పడ్డాడడు. ఆ తరువాత కూడా పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే వారిని చంపేస్తానని బెదిరించాడు.  రోజులు గడుస్తున్న కొద్ది ఆ బాలికలో మార్పు కనిపించింది.

ఈ నెల 24న తీవ్ర కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లిన తల్లిదండ్రులకు బాలిక ఆరు నెలల గర్భవతి అని డాక్టర్‌ చెప్పిన విషయం తీవ్ర దిగ్భాంతికి గురిచేసింది. బాలిక తల్లిదండ్రులు  లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని ప్రశ్నించగా తనకేమీ తెలియదని బుకాయించాడు. దీనితో తమకు న్యాయం చేయాలని ఈ నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడి ఆరోగ్యం బాగా లేనందును అరెస్ట్‌ చేయలేదని పోలీసులు చెప్పడం విశేషం. ఇదిలా ఉండగా నిందితుడి కుటుంబ సభ్యుడు మరో నలుగురితో ఈ కేసు ఉపసంహరించుకోవాల ని బాధితుల ఇంటిపై దాడి చేశారు. బాలికకు అబార్షన్‌ చేయించేందుకు కొందరు బస్తీ పెద్దలు రూ. 30 వేలు ఇప్పిస్తామని ఆశచూపినట్లు సమాచారం. వీరికి ఓ ఎస్‌ఐ సహకరిస్తున్నట్లు తెలిసింది.   

చదవండి: అనుమానంతో ఓ వ్యక్తిపై 10 మంది దాడి..మృతి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top