అనుమానంతో ఓ వ్యక్తిపై 10 మంది దాడి..మృతి

Man Lynched On Suspicion Of Child Abduction In Maharashtra - Sakshi

ముంబై: పిల్లలను అపహరిస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు థానేలోని వాగ్లే ఎస్టేట్‌ ప్రాంతానికి చెందిన అయిదుగురిని ఆదివారం అరెస్ట్‌ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..రామవ్తార్‌ ధోబీ అనే వ్యక్తి తన కూతురిని అపహరించడానికి ప్రయత్నిస్తున్నాడనే అనుమానంతో ఆమె తండ్రి అతడిని వెంబడించాడు. తర్వాత ఓ పదిమంది కలిసి అతడిపై దాడి చేయడంతో ధోబీ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు.

అయితే వీరిలో అరెస్ట్‌ అయిన నిందితులను అతిక్ ఖాన్, మొహసిన్ షేక్, అఫ్సర్ వస్తా, హరీష్ సోలంకి, మహ్మద్ అన్సారీలుగా గుర్తించినట్టు పోలీసులు పేర్కొన్నారు. నేరానికి పాల్పడిన మిగితా నిందితులను పట్టుకోవడాకి వేట కొనసాగుతోందని తెలిపారు. వీరిపై భారత శిక్షాస్మృతి, మహారాష్ట్ర పోలీసు చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు వెల్లడించారు.

(చదవండి: భారతీయ అమెరికన్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top