హైదరాబాద్‌లో ఒక మహిళ, ఇద్దరు యువతుల అదృశ్యం | Two Young Ladies and Woman Missing in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఒక మహిళ, ఇద్దరు యువతుల అదృశ్యం

Feb 14 2022 11:30 AM | Updated on Feb 14 2022 11:41 AM

Two Young Ladies and Woman Missing in Hyderabad  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌(అబ్దుల్లాపూర్‌మెట్‌): వేర్వేరు చోట్ల ఓ మహిళ, యువతి అదృశ్యమయ్యారు. ఈ సంఘటనలు అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నాయి. తారమతిపేటకు చెందిన రక్షిత(19) ఈ నెల 11న ఉదయం మహంకాళీ దేవాలయానికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లింది. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. ఆచూకీ కోసం గ్రామంతో పాటు బంధువుల ఇళ్లలో వాకబు చేయగా జాడ తెలియలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
మరో చోట మహిళ .. 
మండలంలోని కవాడిపల్లికి చెందిన గృహిణి (30) ఈ నెల 12న ఉదయం అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్యాంక్‌కు వెళ్తున్నానని ఇంట్లో  చెప్పి వెళ్లింది. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త అంతటా వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

పహాడీషరీఫ్‌లో యువతి.. 
పహాడీషరీఫ్‌: యువతి అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకటయ్య ఆదివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మామిడిపల్లిలో నివాసం ఉండే కంట్రోత్‌ సంధ్య దగ్గరకు ఆమె అక్క కుమార్తె బడావత్‌ మంజుల (19) ఐదు నెలల క్రితం వచ్చి శంషాబాద్‌ విమానాశ్రయంలో పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే ఈ నెల 5న ఉదయం డ్యూటీకి వెళ్లిన మంజుల సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ చేసి ఉంది. అన్ని ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  ఆచూకీ తెలిసిన వారు 94906 17241 నంబర్‌లో సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.

స్వాతి, మహేశ్వరి, మంజుల (ఫైల్‌ ఫొటోలు) 

Advertisement
 
Advertisement
Advertisement