తాళం వేస్తే చాలు.. ఇదేమి తలాంగు తకధిమి  | Two Times Robbery With in Three Days same House Shadnagar | Sakshi
Sakshi News home page

తాళం వేస్తే చాలు.. ఇదేమి తలాంగు తకధిమి 

Feb 12 2022 6:25 PM | Updated on Feb 12 2022 6:26 PM

Two Times Robbery With in Three Days same House Shadnagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఈశ్వర్ కాలనీలో గుండ్ల శేఖర్ గౌడ్ అనే వ్యక్తి ఇంట్లో మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు చోరీలు జరిగాయి. ఇంటికి తాళం వేస్తే చాలు చోరీలు జరుగుతున్నాయి. ఒకే ఇంట్లో రెండుసార్లు వరుస చోరీలు జరుగుతుండటంతో ఈ చోరులు పోలీసులకు సవాల్ విసురుతున్నట్టు ఉంది. ఫిబ్రవరి 9న ఇదే ఇంట్లో చోరీ జరిగినట్టు  షాద్ నగర్ పట్టణ సిఐ నవీన్ కుమార్ ఇదివరకే మీడియాకు తెలిపారు.

బాధితుడు శేఖర్ గౌడ్ పనిమీద భార్యతో పాటుగా ఇటీవల హైదరాబాద్‌ వెళ్లాడు. గత బుధవారం ఉదయం తిరిగి  షాద్ నగర్ లోని తన ఇంటికి వచ్చే చూసే సరికి ఇంటి డోర్ తాళం పగల గొట్టబడి ఉన్నదని పోలీసులు పేర్కొన్నారు. ఇంట్లోకి వెళ్లి చూడగా కబోర్డులో ఉన్న బంగారం 2.5 తులాలు, 6 గ్రాముల వెండి ఆభరణాలు దొంగలించుకొని పోయారని బాధితులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement