Mangalore: జైలులో కొట్టుకున్న ఖైదీలు | Two Prisoners Fight In Jail Banashankari | Sakshi
Sakshi News home page

Mangalore: జైలులో కొట్టుకున్న ఖైదీలు

Apr 26 2021 3:14 PM | Updated on Apr 26 2021 4:42 PM

Two Prisoners Fight In Jail Banashankari - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బనశంకరి: మంగళూరు జిల్లా జైలులో ఖైదీలు పరస్పరం దాడులకు దిగడంతో ఇద్దరు గాయపడ్డారు. పణంబూరు పోలీస్‌స్టేషన్‌లో దోపిడీ కేసులో అరెస్టయి జైలులో ఉన్న సమీర్‌ అనే ఖైదీ ఇతర ఖైదీలపై దాడికి దిగాడు. మూల్కి పోలీసులు ఇటీవల అరెస్ట్‌ చేసిన అన్సార్‌పై ఆదివారం ఉదయం దాడికి దిగాడు. దాడిలో అన్సార్‌తో పాటు మూడిబిదిరే దోపిడీ కేసులో ఉన్న ఖైదీ జైనుద్దీన్‌ కూడా గాయపడ్డాడు. వీరిని ఆస్పత్రికి తరలించారు. మంగళూరు జైలును పోలీస్‌ కమిషనర్‌ శశికుమార్‌ సందర్శించారు. ఈ సందర్భంగా జైలులోని ఇతర ఖైదీలు గట్టిగా కేకలు వేయడంతో పోలీసులు వారిపై లాఠీ ఝుళిపించారు.

(చదవండి: పెళ్లి పేరుతో శారీరకంగా అనుభవించి.. 37 లక్షలతో! )

Advertisement
 
Advertisement
Advertisement