ప్రాణం తీసిన ఈత సరదా | Two people died in Krishna river | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఈత సరదా

Oct 28 2024 4:18 AM | Updated on Oct 28 2024 4:18 AM

Two people died in Krishna river

కృష్ణానది ఊబిలో కూరుకుపోయిన ఐదుగురు యువకులు 

ముగ్గురిని కాపాడిన మత్స్యకారులు.. ఇద్దరు మృతి 

తాడేపల్లిరూరల్‌/అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడసెంట్రల్‌): ఈతకొట్టేందుకు కృష్ణా నదిలో దిగిన ఐదు­గురు యువకులు ప్రమాదవశాత్తూ ఊబిలో కూరుకుపోగా వారిలో ముగ్గుర్ని మత్స్యకారులు కాపాడా­రు. ఇద్దరు మరణించారు. గుంటూరు జిల్లా సీతానగరం రైల్వే బ్రిడ్జ్‌ సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన గుడివాడ వెంకటేశ్వరరావు   కుమారుడు దుర్గాప్రసాద్‌(23), చివుకు రమేష్ కుమారుడు హేమంత్‌ కుమార్‌ (17) మరో ముగ్గురితో కలిసి ఆదివారం సాయంత్రం సీతానగరం రైల్వే బ్రిడ్జి వద్ద కృష్ణా నదిలో ఈతకొట్టేందుకు దిగారు. 

ఈ క్రమంలో రైల్వే బ్రిడ్జి రెండో దిమ్మె వద్ద ఉన్న ఊబిలో కూరుకుపోయారు. హేమంత్, దుర్గాప్రసాద్‌ పూర్తిగా నీటలో మునిగిపోగా మిగిలిన ముగ్గురూ కేకలు వేయగా మత్స్యకారులు ముగ్గుర్ని కాపా­డారు. మ­రో ఇద్దరు మునిగినిపోయారని చెప్పడంతో మత్స్యకారులు వారి­ని వెతుకుతుండగా ముగ్గు­రూ అక్కడినుంచి వెళ్లిపోయారు. 

సమా­చారం అందుకున్న తాడేపల్లి సీఐ కళ్యాణ్‌రాజు  సిబ్బందితో అ­క్కడికి చేరుకుని మత్స్యకారుల సహాయంతో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరణించిన ఇద్దరిలో దుర్గాప్రసాద్‌ దివ్యాంగుడు, ఎల్రక్టీíÙయన్‌గా పనిచేస్తూ తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నాడు. హేమంత్‌ ఇంటర్మీడియెట్‌ చదువుతున్నాడు.  

సూర్యలంక తీరంలో యువకుడు గల్లంతు 
బాపట్ల: బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన భారీ అలల­కు గుంటూరు కొత్తపేటకు చెంది­న రేషి కళ్యాణ్‌ (20) అనే యువకుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. గుంటూరు నుంచి వచ్చిన తొమ్మిది మంది సముద్రంలో స్నానానికి దిగగా ఒక్కసారిగా పెద్ద అలలు రావడంతో కల్యాణ్‌ కొట్టుకుపోయాడు.   

Advertisement
 
Advertisement
Advertisement