షాకింగ్.. స్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొట్టి 3 కి.మీ ఈడ్చుకెళ్లిన ‍ట్రక్కు | Truck Rams Into Woman Scooty Drags Her For 3 Km Up Banda | Sakshi
Sakshi News home page

షాకింగ్.. స్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొట్టి 3 కి.మీ ఈడ్చుకెళ్లిన ‍ట్రక్కు..

Jan 4 2023 9:32 PM | Updated on Jan 4 2023 9:33 PM

Truck Rams Into Woman Scooty Drags Her For 3 Km Up Banda - Sakshi

లక్నో: ఢిల్లీలో 20 ఏళ్ల యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఘటన మరువకముందే అలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది. ఉత్తర్‌ప్రదేశ్ బాందాలో స్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొట్టిన ట్రక్కు.. ఆమెను మూడు కిలోమీటర్లు అలాగే ఈడ్చుకెళ్లింది. బాందా జిల్లాలోని మవాయ్ బుజర్గ్ గ్రామంలో బుధవారం ఈ దారుణం జరిగింది.

మహిళ మృతదేహం చిక్కుకోవడంతో రాపిడికి ట్రక్కు కింద నుంచి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. దీంతో అగ్నిమాపక యంత్రాలు వెళ్లి మంటలను ఆర్పాయి. పోలీసులు మహిళ మృతదేహాన్ని బయటకు తీసేందుకు శ్రమించారు.
చదవండి: భారత్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టడం ఎలా?

Advertisement
 
Advertisement
Advertisement