Hyderabad: ముగ్గురు యువతుల అదృశ్యం కలకలం | Three Women Missing In Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: ముగ్గురు యువతుల అదృశ్యం కలకలం

May 29 2021 11:06 AM | Updated on May 29 2021 12:05 PM

Three Women Missing In Hyderabad - Sakshi

బంజారాహిల్స్‌: అనుమానాస్పద స్థితిలో యువతి అదశ్యమైన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వెంకటగిరి వాటర్‌ ట్యాంక్‌ సమీపంలో నివసించే బండారి వెంకట సునీత భవానీ(21) జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పని చేస్తుంది. ఈ నెల 27వ తేదీన రాత్రి కొత్తగా అద్దెకు తీసుకున్న ఇంటిని శుభ్రం చేసేందుకు తల్లి మణి వెళ్లింది. అదే సమయంలో కుమార్తె వెంకట సునీత భవానీ తల్లికి ఫోన్‌ చేసి జూనియర్‌ ఆర్టిస్ట్‌గా ఏడాది పాటు ఒప్పందం ఉందని, ఇప్పుడు తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పింది.

అంతే కాకుండా నెల తర్వాత తిరిగి వస్తానని అప్పటి వరకు తన కోసం వెతకొద్దంటూ ఫోన్‌ పెట్టేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. వెంటనే తల్లి మణి ఇంటికి వెళ్లి విచారించగా కూతురు కనిపించలేదు. లగేజీతో సహా ఓలా ఆటోలో వెళ్లినట్లుగా చుట్టుపక్కల వారు తెలిపారు. బంధుమిత్రుల ఇళ్లల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో తన కూతురు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 9490616589 నంబర్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు. 

మరో ఘటనలో
అనుమానాస్పద స్థితిలో మరో యువతి అదశ్యమైన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.46 అంబేడ్కర్‌నగర్‌లో నివసించే కొమ్మోళ్ల శిరీష(21) ఈ నెల 27వ తేదీన పాల ప్యాకెట్లు తీసుకురావడానికి కిరాణ దుకాణానికి వెళ్ళి ఇంటికి తిరిగిరాలేదు. తండ్రి యాదయ్య బంధుమిత్రుల ఇళ్లల్లో వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో తన కూతురు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 9885287323 నంబర్‌లో సంప్రదించాలని వారు తెలిపారు.

బంధువుల ఇంటికి వచ్చిన యువతి అదృశ్యం 
మల్కాజిగిరి: బంధువుల ఇంటికి వచ్చిన యువతి అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం...మల్కాజిగిరి మారుతీనగర్‌కు చెందిన జయంత్‌ ఈనెల 25 వ తేదీ తూర్పుగోదావరి జిల్లా గంగాధరంలో ఉంటున్న వదిన కూతురు అనుష్క(18)ని మల్కాజిగిరికి తీసుకొని వచ్చాడు. ఈ నెల 27వ తేదీ ఉదయం అనుష్క కనిపించలేదు. ఈ సంఘటన పై శుక్రవారం ఫిర్యాదుచేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: శ్మశానవాటిక గుంత: వ్యక్తి దారుణ హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement