
సాక్షి, వైఎస్సార్: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సమస్యలతో ఓ తండ్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా.. తండ్రి మరణాన్ని తట్టుకోలేని అతని ఇద్దరు కూతుళ్లు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. ప్రొద్దుటూరులోని వైఎమ్‌ఆర్ కాలనీకి చెందిన బాబురెడ్డి.. కుటుంబ సమస్యలు, పెద్ద కూతరైన శ్వేతను భర్త వేదించడాన్ని తట్టుకోలేక సెల్ఫీవీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకున్నాడు.
తండ్రి మరణవార్తను భరించలేని అతని ఇద్దరు కూతుళ్లు శ్వేత, ఇంజనీరింగ్ చదువుతున్న సాయి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు - రాణిపేట మధ్యగల రైల్వే ట్రాక్ పైన ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదివింది మూడు.. నకిలీ కంపెనీని సృష్టించి)