బీటెక్‌ విద్యార్థి హత్య.. చంపింది వారు ముగ్గురే.. | Three Friends Arrest In Btech Prashanth Case | Sakshi
Sakshi News home page

బీటెక్‌ విద్యార్థి హత్య.. చంపింది వారు ముగ్గురే..

Aug 23 2024 10:45 AM | Updated on Aug 23 2024 11:25 AM

Three Friends Arrest In Btech Prashanth Case

సాక్షి, హైదరాబాద్‌: బాలాపూర్‌లో బీటెక్‌ విద్యార్థి ప్రశాంత్‌ హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ హత్య కేసులో నిందితులను అతడి స్నేహితులుగానే గుర్తించారు పోలీసులు. ప్రశాంత్‌ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

వివరాల ప్రకారం.. బాలాపూర్‌లో బీటెక్ విద్యార్థి ప్రశాంత్‌ను హత్య చేశారు. బాలాపూర్ చౌరస్తాలోని హోటల్ 37 వద్ద ప్రశాంత్‌ను ముగ్గురు స్నేహితులు కత్తితో పొడిచి హత్య చేశారు. దీంతో, కేసు నమోదు పోలీసులు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు డీసీపీ సునీతా రెడ్డి ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేశారు. అనంతరం, శుక్రవారం ఉదయం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు.. ప్రశాంత్, నిందితులు ముగ్గురు ఒకే బస్తీలో నివాసం ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే, ఓ యువతి ప్రేమ విషయంలో నిందితులు.. ప్రశాంత్‌ను హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, గడిచిన 15 రోజుల్లోనే బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు హత్యలు జరిగాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement