ఘోరం: కారులోనే ముగ్గురు సజీవదహనం

Three Of A Family Burnt To Death As Car Catches Fire In Mandya - Sakshi

కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఘటన

రాయిని ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు

బయటకు రాలేక మంటల్లోనే ఆహుతి

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

మండ్య: రోడ్డు పక్కనున్న రాయిని ఢీకొని ఓ కారు బోల్తా పడి మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం కాగా, ఇద్దరు గాయపడ్డారు. జిల్లాలోని మళవళ్లి తాలూకా హలగూరులో ఈ ఘోరం జరిగింది. వివరాలు.. బెంగళూరుకు చెందిన కేజీ హళ్లి నివాసి షేక్‌ కైజల్‌ (45) కాంట్రాక్టు పనులు చేస్తున్నాడు. భార్య మెహక్‌(33), కుమార్తెలు షేక్‌ ఐహిల్‌ (6)  మెహైరా (11), సుహాన (12)తో కలిసి ఓ పని నిమిత్తం జిల్లాలోని కొళ్లెగాల హనూరు వచ్చారు. శుక్రవారం ఉదయం  బెంగళూరు బయల్దేరారు. హలగూరు భారతీయ పెట్రోల్‌ బంక్‌ వద్ద కారు నియంత్రణ తప్పి రోడ్డు పక్కన సేఫ్టీ స్టోన్‌ను ఢీ కొట్టి పక్కనే ఉన్న గుంటలో బోల్తా పడింది. కారు నుంచి మంటలు చెలరేగి వాహనం దగ్ధమైంది. షేక్‌ కైజల్,  సుహాన, షేక్‌ ఐహిల్‌ మృత్యువాత పడ్డారు. తీవ్ర గాయాలైన మిగతా ఇద్దరిని  బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై హలగూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

చదవండి: ముగ్గురి ఊపిరి తీసిన మ్యాన్‌హోల్‌​​​​​​​

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top