ముగ్గురి ఊపిరి తీసిన మ్యాన్‌హోల్

రామనగర పట్టణంలో విషాదం
ఊపిరాడక ముగ్గురు కాంట్రాక్టు కార్మికుల మృతి
దొడ్డబళ్లాపురం: సురక్షిత పరికరాలు లేకుండా భూగర్భ డ్రైనేజీని శుభ్రం చేసేందుకు వెళ్లిన ముగ్గురు కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ఊపిరాడక మృతిచెందారు. ఈ ఘటన రామనగర పట్టణంలో చోటుచేసుకుంది. హరీష్ అనే కాంట్రాక్టర్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్వహణను చూస్తుంటాడు. పట్టణ పరిధిలోని న్యూ నేతాజీ స్కూల్ వెనుక డ్రెనేజీలో సమస్య ఏర్పడింది. దీంతో మంజునాథ్ అనే వ్యక్తి ఇద్దరు కార్మి కులు, రాకేశ్‌లను బెంగళూరు నుంచి పిలిపించారు. శుక్రవారం మధ్యాహ్నం మ్యాన్‌హోల్‌లో దిగి పనులు చేస్తుండగా ఊపిరి ఆడక అస్వస్థతకు గురయ్యారు. అగి్నమాపక సిబ్బంది, రామనగర పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తాళ్లతో బాధితులను బయటకు తీసి రామనగర ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. కేసు దర్యాప్తులో ఉంది.