జూబ్లీహిల్స్‌ వివాదాస్పద భూమిపై హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana High Court Key Order In Jubilee Hills Land Dispute Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ వివాదాస్పద భూమికి సంబంధించి యథాస్థితి కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిన నందకుమార్‌కు శిక్ష ఖరారు చేసింది.

నందకుమార్‌కు నెల రోజులు జైలు శిక్ష, రూ. 2 వేలు జరిమానా విధించింది. డెక్కన్ కిచెన్ హోటల్‌ లీజు విషయంలో దగ్గుపాటి ఫ్యామిలీకి నంద కుమార్‌కి వివాదం నడుస్తోంది. 2021లో నమోదు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నందకుమార్‌.. డివిజన్ బెంచ్‌లో అప్పీల్  పిటిషన్‌ వేశారు.

ఇదీ చదవండి: రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో నటి పేరు!

whatsapp channel

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top