దళితుడిపై టీడీపీ నాయకుడు దాడి  | TDP Leader Attack Man In Anantapur District | Sakshi
Sakshi News home page

దళితుడిపై టీడీపీ నాయకుడు దాడి 

Aug 28 2020 10:37 AM | Updated on Aug 28 2020 10:37 AM

TDP Leader Attack Man In Anantapur District - Sakshi

బాధితుడు వన్నూర్‌స్వామి

గుమ్మఘట్ట(అనంతపురం): మండల పరిధిలోని భూపసముద్రానికి చెందిన హరిజన వన్నూర్‌స్వామి అనే దళితుడిపై అదే గ్రామానికి  చెందిన గొల్ల నాగిరెడ్డి అనే టీడీపీ నాయకుడు రాయితో బాది గాయపరిచాడు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..  మూడు రోజుల క్రితం కాలనీకి సమీపంలో ఉన్న ఓ ఇంటి వద్ద కుర్చుని సెల్‌ఫోన్లో పాటలు వింటుండగా..  వెనుక నుండి వచ్చిన నాగిరెడ్డి ఉన్నట్టుండి తనపై రాయి విసిరాడని చెప్పారు. రాయి నేరుగా తనపై పడి ఉంటే అక్కడికక్కడే ప్రాణాలు పోయేవని, పక్కన ఓ తీగకు తగిలి నెత్తిమీద పడటంతో తీవ్ర రక్తంతో స్పృహతప్పి పడిపోయానని పేర్కొన్నారు.

బంధువులు రాయదుర్గం ఆస్పత్రికి తరలించగా 10 కుట్లు పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటితో వదులను  చంపితీరతానని నాగిరెడ్డి హెచ్చరిస్తున్నాడని తెలిపారు. అతడి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై గుమ్మఘట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడతామని ఎస్‌ఐ తిప్పయ్యనాయక్‌ చెప్పారు. ఇదిలా ఉండగా పలువురు ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆస్పత్రిలో బాధితుడిని పరామర్శించారు. దాడికి పాల్పడ్డ గొల్ల నాగిరెడ్డి పై తక్షణం కేసు నమోదుచేసి జైలుకు పంపాలని డిమాండ్‌ చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement