అమెరికాలో సూర్యాపేట జిల్లావాసి మృతి | Suryapet district resident died in America | Sakshi
Sakshi News home page

అమెరికాలో సూర్యాపేట జిల్లావాసి మృతి

Aug 26 2024 4:28 AM | Updated on Aug 26 2024 4:28 AM

Suryapet district resident died in America

స్విమ్మింగ్‌ పూల్‌లో ఈతకు వెళ్లి దుర్మరణం  

ఆత్మకూర్‌ (ఎస్‌): అమెరికాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ (ఎస్‌) మండలం పాతర్లపహాడ్‌ గ్రామానికి చెందిన తప్సి ప్రవీణ్‌కుమార్‌ (39) ప్రమాదవశాత్తు స్విమ్మింగ్‌ పూల్‌లో పడి మృతిచెందాడు. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో ప్రవీణ్‌కుమార్‌ వారి ఇంటి సమీపంలోని స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద కాలక్షేపం కోసం వెళ్లి అందులో పడి మృతి చెందినట్లు అతడి భార్య శాంతి ఆదివారం ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపారు. 

పాతర్లపహాడ్‌ గ్రామానికి చెందిన నాగయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. మృతుడు ప్రవీణ్‌ చిన్న కుమారుడు. ఎమ్మెస్సీ చేసిన ప్రవీణ్‌ హైదరాబాద్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఉపాధ్యాయ వృత్తిలో మంచి నైపుణ్యం ఉన్న ప్రవీణ్‌ ఆ్రస్టేలియా ఇతర దేశాల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

ఐదేళ్ల క్రితం మిత్రులతో కలిసి అమెరికాకు వెళ్లిన ప్రవీణ్‌కుమార్‌ అట్లాంటా ప్రాంతంలో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రవీణ్‌కుమార్‌ మృతితో పాతర్లపహాడ్‌ గ్రామంలో విషాదం నెలకొంది.  

Advertisement
 
Advertisement
Advertisement