స్టార్‌ హోటల్‌లో బాలికపై లైంగిక దాడి | Star Hotel Girl Incident In Hyderabad | Sakshi
Sakshi News home page

స్టార్‌ హోటల్‌లో బాలికపై లైంగిక దాడి

Oct 13 2026 11:39 AM | Updated on Oct 13 2026 11:39 AM

Star Hotel Girl Incident In Hyderabad

హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం పెంచుకుని  బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి, లైంగికంగా వేధించడంతో పాటు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు  చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఆసిఫ్‌నగర్‌కు చెందిన బాలికతో మహమ్మద్‌ ఖురేషీ సామాజిక మద్యమాల ద్వారా పరిచయం పెంచుకున్నాడు. అనంతరం బాలికకు సంబంధించిన  చిత్రాలు, వీడియోలు సేకరించి వాటిని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్‌లోని స్టార్‌ హోటల్‌ లీలాకు బాలికను పిలిపించి లైంగికంగా, శారీరికంగా వేధింపులకు పాల్పడ్డాడు. 

అంతేకాకుండా బాలిక నుంచి రూ.29  వేలు, బంగారు ఆభరణాలు, పాస్‌పోర్టు తీసుకున్నాడు. నెలసరి ఆలస్యం కావడంపై బాలిక ఆందోళన వ్యక్తంచేయగా, బలవంతంగా గర్భ నిరోధక మాత్రలను వేశాడు. నిందితుడి ఇంటికి వెళ్లి  తల్లితో మాట్లాడేందుకు ప్రయత్నించగా  ఇంటికి తాళం వేసి ఉంది. ఆరా తీయగా నిందితుడు తల్లితో కలిసి దుబాయ్‌కు పరారైనట్లు తెలుసుకున్నారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితడు మహమ్మద్‌ ఖురేషీపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement