దారుణం: కానిస్టేబుల్‌పై ట్రాన్స్‌ జెండర్ల దాడి.. పరిస్థితి విషమం

Six Transgenders Assault On Police Constable Arrested Bhubaneswar They Are Arrested - Sakshi

భువనేశ్వర్‌: ట్రాన్స్‌ జెండర్లు రైళ్లలో ప్రయాణికులను బెదిరిస్తూ డబ్బులను వసూలు చేసే సంఘటనలను చూస్తూ ఉంటాం. అదే విధంగా తమను అల్లరి చేసిన వారిని నడిరోడ్డు మీదనే చితకబాదిన వార్తలు విన్నాం. కానీ, తాజాగా ఆరుగురు ట్రాన్స్‌ జెండర్లు ఏకంగా ఓ పోలీసు కానిస్టేబుల్‌పై దాడి చేశారు. ఈ ఘటన ఒడిశాలోని భరత్‌పూర్ పోలీసు స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ట్రాన్స్‌ జెండర్ల దాడిలో తీవ్రంగా గాయపడిని కానిస్టేబుల్‌ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు.

ఈ ఘటనకు పాల్పడిన నిందితులు.. రిని బెహరా, సాలిని దాస్, లోపా సేథి, దీపాలి నాయక్, సుని జెనాగా పోలీసులు గుర్తించారు. వారి మీద హత్య కేసు న​మోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు వెల్లడించారు. కానిస్టేబుల్‌పై ఎందుకు దాడి చేశారనే కోణంలో ట్రాన్స్‌ జెండర్లపై విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top