breaking news
bhuwangiri town
-
దారుణం: కానిస్టేబుల్‌పై ట్రాన్స్ జెండర్ల దాడి.. పరిస్థితి విషమం
భువనేశ్వర్: ట్రాన్స్ జెండర్లు రైళ్లలో ప్రయాణికులను బెదిరిస్తూ డబ్బులను వసూలు చేసే సంఘటనలను చూస్తూ ఉంటాం. అదే విధంగా తమను అల్లరి చేసిన వారిని నడిరోడ్డు మీదనే చితకబాదిన వార్తలు విన్నాం. కానీ, తాజాగా ఆరుగురు ట్రాన్స్ జెండర్లు ఏకంగా ఓ పోలీసు కానిస్టేబుల్‌పై దాడి చేశారు. ఈ ఘటన ఒడిశాలోని భరత్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ట్రాన్స్ జెండర్ల దాడిలో తీవ్రంగా గాయపడిని కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు.. రిని బెహరా, సాలిని దాస్, లోపా సేథి, దీపాలి నాయక్, సుని జెనాగా పోలీసులు గుర్తించారు. వారి మీద హత్య కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు వెల్లడించారు. కానిస్టేబుల్‌పై ఎందుకు దాడి చేశారనే కోణంలో ట్రాన్స్ జెండర్లపై విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
భవనంపై నుంచి పడి యువకుడి మృతి
భువనగిరి టౌన్(నల్లగొండ జిల్లా): ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలోని ఆర్బీనగర్ కాలనీలో గురువారం జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన పొకల ఉదయ్‌కుమార్(25) మూడు అంతస్తుల భవనంపై ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. విషయం తెలిసిన స్థానికులు అతన్ని వెంటనే 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, అతన్ని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.