భవనంపై నుంచి పడి యువకుడి మృతి | A youth slipped from 3 floor building in bhuwangiri town | Sakshi
Sakshi News home page

భవనంపై నుంచి పడి యువకుడి మృతి

Jul 9 2015 1:11 PM | Updated on Sep 3 2017 5:11 AM

ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు.

భువనగిరి టౌన్(నల్లగొండ జిల్లా): ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలోని ఆర్బీనగర్ కాలనీలో గురువారం జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన పొకల ఉదయ్‌కుమార్(25) మూడు అంతస్తుల భవనంపై ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. విషయం తెలిసిన స్థానికులు అతన్ని వెంటనే 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు.

అయితే, అతన్ని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

పోల్

Advertisement