భర్తకు దూరంగా ఉంటూ.. మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌తో ఐదేళ్లు సహజీవనం చేసి.. ఆ తర్వాత..

Sensational Honey Trap Blackmailer Radha Arrested In Jaipur - Sakshi

జైపూర్‌: ఆమె అందంతో ఎంతో మందిని తన వలలో వేసుకుంది. చివరకు మిస్టర్ రాజస్థాన్ టైటిల్ విన్నర్‌ కూడా ఆమె చేతికి చిక్కి ఇబ్బందులకు గురయ్యాడు. అతడిని హనీ ట్రాప్‌ చేసిన సదరు యువతి.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హనీ ట్రాప్‌ ఉందతం రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌కు చెందిన రాధ.. కొన్నేళ్ల క్రితం తన కుటుంబాన్ని వదిలి రాజస్థాన్‌లోని జైపూర్‌లో నివాసం ఉంటోంది. తనకు పెళ్లి అయిన్పప్పటికీ భర్తకు దూరంగా ఉంటోంది. కాగా, జైపూర్‌లో రాధ.. కొద్ది రోజులు బ్యూటీ పార్లర్‌ నిర‍్వహించింది. అనంతరం జైపూర్‌ మెట్రో పనిచేస్తుండగా.. ఆరేళ్ల క్రితం ఆమె స్నేహితురాలి ద్వారా ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది. దీంతో వీరిద్దరూ డీప్‌ లవ్‌లో మునిగిపోయి దాదాపు ఐదేళ్ల పాటు సహజీవనం కొనసాగించారు. అనంతరం వీరి మధ్య మనస్పర్థలు రావడంతో రాధ ఆ యువకుడికి దూరమైంది. ఈ క్రమంలో సదరు యువకుడు మిస్టర్ రాజస్థాన్ టైటిల్ గెలుచుకున్నాడు. గతేడాది ఏప్రిల్‌లో యువకుడికి వివాహం కూడా జరిగింది.

మరోవైపు రాధ.. ఓ డ్యాన్స్ గ్రూప్‌లో చేరి అస్సాం వెళ్లింది. సదరు యువకుడిని విడిచిపెట్టి ఆమె మరికొంత మంది యువకులతో కలిసి జీవించడం ప్రారంభించింది. కాగా, గతేడాది మే నెలలో రాధ మళ్లీ జైపూర్‌కు చేరుకుంది. తన ప్రియుడికి(మిస్టర్ రాజస్థాన్) వివాహం జరిగిందన్న విషయం తెలిసి అతడిని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్‌ చేసింది. తమ సంబంధం గురించి అతడి భార్యకు, కుటుంబ సభ్యులకు చెబుతానని బెదిరించి కొద్ది నెలలుగా డబ్బులు వసూలు చేయడం ప్రారంభించింది.

ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం రాధ అతడిని రూ. 20 లక్షలు డిమాండ్‌ చేయగా.. తన వద్ద లేవని చెప్పడంతో.. రాధ ఆ వ్యక్తిని అత్యాచారం కేసులో ఇరికిస్తానని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. ఈ వేధింపులు భరించలేక అతను పోలీసులను ఆశ్రయించాడు. పధకం ప్రకారం.. సదరు వ్యక్తి ఓ హోటల్‌లో బ్లాక్ మెయిలర్ రాధకు రూ.50 వేల నగదు,  మూడు చెక్కులను ఇస్తుండగా పోలీసులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం రాధను సంజయ్‌ సర్కిల్‌ పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top