Karimnagar Man Selfie Suicide Due To Brother Harassment, Goes Viral - Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో సెల్ఫీ సూసైడ్ కలకలం

Jan 20 2022 12:18 PM | Updated on Jan 20 2022 1:41 PM

Selfie Suicide With harassment by Brother in Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌లో సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది. నగరంలోని తిరుమలనగర్‌కి చెందిన తిప్పారపు శ్రీనివాసాచారి(42) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.. తనకు చెందాల్సిన ఆస్తిని తన అన్న అక్రమంగా అతని భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన అక్క కూడా మోసం చేసిందని వాపోయాడు.
చదవండి: పెళ్లైన ఆర్నెళ్లకే.. భార్యను వదిలేసి ప్రియురాలితో.. 

కరీంనగర్‌లోని భగత్ నగర్ లోని ప్రాపర్టీ విషయంలో తనకు అన్యాయం జరిగిందని శ్రీనివాసచారి వివరించారు. అందుకే చనిపోతున్నట్టు వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ఐదున్నర గంటలు..6 నేరాలు.. వీడు మామూలోడు కాదురోయ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement