మోదీజీ నా చివరి కోరికలు తీర్చండి, ప్లీజ్.. అలా అయితేనే..

School Boy Dies By Suicide Asks Pm Fulfill Madhya Pradesh - Sakshi

భోపాల్‌:ఇటీవల కొందరు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ బాలుడు తాను అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోతున్నానే బాధతో రన్నింగ్‌ ట్రైన్‌ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ‍ప్రకారం.. 16 ఏళ్ల బాలుడు కదిలే రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

గ్వాలియర్ నగరంలోని క్యాన్సర్ పహాడియా ప్రాంతానికి చెందిన అజిత్ వంశకర్ అనే 11వ తరగతి విద్యార్థి ఆదివారం మధ్యాహ్నం కదిలే రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అతని మృతదేహం వద్ద సూసైడ్‌​ నోట్‌ లభించినట్లు తెలిపారు. అందులో.. తాను ఫేమస్‌ డ్యాన్సర్‌ కావాలనే కోరిక తనకు బలంగా ఉండేదని కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అది కుదరలేదని అందుకు తీవ్ర నిరాశకు లోనైట్లు రాశాడు.

మరో వైపు అతని కుటుంబ సభ్యులు కూడా అతని కలకి అనుకూలంగా లేరని పేర్కొన్నాడు. తన కోసం ఓ పాట ట్యూన్‌ చేయాలని కోరుతూ.. ఆ పాటను సింగర్‌ అర్జిత్ సింగ్ పాడాల్సిందిగా, నేపాలీ కొరియోగ్రాఫర్‌ సుశాంత్ ఖత్రితో డాన్స్‌ కంపోజ్‌ చేయాలని అందులో తెలిపాడు. తన చివరి కోరికను నెరవేర్చాలని ఆ బాలుడు ప్రధాని నరేంద్ర మోదీని కూడా అభ్యర్థించాడు. ఇవి చేస్తే తన ఆత్మ శాంతిస్తుందన్నాడు. చివరిలో తన జీవితంలో తీసుకున్న ఈ నిర్ణయానికి ఎవరూ బాధ్యులు కారని తెలిపాడు. 

చదవండి: Drugs Case: రేవ్‌ పార్టీ.. ఎవరికీ అనుమానం రాకుండా అందులో డ్రగ్స్‌..షాకైన పోలీసులు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top