Drugs Case: రేవ్‌ పార్టీ.. ఎవరికీ అనుమానం రాకుండా అందులో డ్రగ్స్‌..షాకైన పోలీసులు

Mumbai: Woman Carry Drugs In Sanitary Pad Drugs On Cruise Case - Sakshi

ముంబై: డ్రగ్స్‌ దందాను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ, కేటుగాళ్లు సరికొత్త దారులు ఎంచుకుంటూ సరఫరా చేస్తూనే ఉన్నారు. తాజాగా ముంబయి క్రూయిజ్‌ నౌకలో జరిగిన రేవ్‌ పార్టీలో ఓ మహిళ ఏకంగా శానిటరీ న్యాప్‌కిన్‌లో డ్రగ్స్‌ తీసుకువెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలడంతో షాక్‌ గరయ్యారు. కాగా ఈ వ్యవహారంలో ఇప్పటివరకు మొత్తం 19మందిని అరెస్టు చేసినట్లు ఎన్‌సీబీ అధికారులు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా అక్టోబర్‌ 11న విచారణకు హాజరు కావాలంటూ తాజాగా ప్రొడ్యూసర్‌ ఇంతియాజ్‌ ఖత్రీకి ఎన్‌సీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. 

ఇప్పటికే డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్‌పై బయటకు వచ్చేందుకు ఆర్యన్‌ ఖాన్‌ ఇప్పటికే ప్రయత్నించగా న్యాయస్థానం అందుకు నిరాకరించింది. ముంబై మెజిస్ట్రేట్ కోర్టు గురువారం ఆర్యన్ ఖాన్ సహా ఏడుగురిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆర్యన్ ఖాన్ తరఫున వాదిస్తున్న న్యాయవాది సతీష్ మనేషిండే కోర్టులో.. ఆర్యన్ ఖాన్‌ను క్రూయిజ్ పార్టీకి ఆహ్వానించారు. అయితే, అతనికి బోర్డింగ్ పాస్ కూడా లేదు. రెండవది, పోలీసులు అర్యాన్‌ని అదుపులోకి తీసుకుంది కూడా కేవలం అతని చాట్‌ ఆధారంగా మాత్రమేనని మరే ఇతర బలమైన అధారాలు లేవని తెలిపారు. 

చదవండి: భార్యే తెగబడిందా.. ప్రియుడు సహకరించాడా..?

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top