టీడీపీ నేతపై అట్రాసిటీ కేసు నమోదు | SC ST Atrocities case registered against TDP leader Jyothula Naveen | Sakshi
Sakshi News home page

జ్యోతుల నవీన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

Oct 5 2020 10:21 PM | Updated on Oct 6 2020 8:18 AM

SC ST Atrocities case registered against TDP leader Jyothula Naveen - Sakshi

సాక్షి, జగ్గంపేట: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో సోమవారం ఓ దళిత యువకుడిపై కాకినాడ టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మాజీ జెడ్పీ చైర్మన్‌ జ్యోతుల నవీన్‌ కుమార్‌ దాడి చేశారు. ఘటన వివరాలిలా ఉన్నాయి.. జగ్గంపేట–కాకినాడ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. దీనికోసం తవ్విన డ్రైయిన్‌లో వాన నీరు నిలిచిపోయింది. దీంతో ఆర్‌ అండ్‌ బీ రోడ్డుకు ఆనుకుని నిర్మించిన రెండు దుకాణాలు పడిపోయాయి.

ఈ విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న జ్యోతుల నవీన్‌ ప్రొక్లెయిన్‌ ఆపరేటర్‌ చీర ధనకృష్ణతో వాగ్వాదానికి దిగారు. షాపులు పడిపోయేలా మట్టి ఎందుకు తొలగించావని ప్రశ్నించారు. అధికారులు తెలిపిన కొలతల ప్రకారమే తాను మట్టి తొలగించానని చెబుతుండగానే అతడిపై నవీన్‌ చేయిచేసుకున్నారు. దీంతో బాధితుడు ధనకృష్ణ జగ్గంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నవీన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు దాడి కేసు కూడా నమోదు చేశామని ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement