దారుణం: మందలించాడని రిటైర్డ్‌ ఏఎస్‌ఐ మర్డర్‌ | Rowdy Sheeter Eliminated Retired ASI At Chirala In Prakasam | Sakshi
Sakshi News home page

దారుణం: మందలించాడని మర్డర్‌ చేశాడు

Aug 23 2020 9:04 AM | Updated on Sep 30 2021 7:13 PM

రిటైర్డ్‌ ఏఎస్‌ఐ సుద్దనగుంట నాగేశ్వరరావు గొడవ చేయొద్దని సురేంద్రను మందలించాడు. 

సాక్షి, ప్రకాశం: చీరాల మండలం తోటవారిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. గొడవ చేయొద్దని మందలించినందుకు రిటైర్డ్‌ ఏఎస్‌ఐ దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు.. రౌడీ షీటర్‌ సురేంద్ర మద్యం మత్తులో స్థానికంగా ఇళ్ల వద్ద రోజూ గొడవ చేస్తున్నాడు. అక్కడే నివాసముండే రిటైర్డ్‌ ఏఎస్‌ఐ సుద్దనగుంట నాగేశ్వరరావు గొడవ చేయొద్దని సురేంద్రను మందలించాడు. దీంతో గత అర్ధరాత్రి ఇంట్లో చొరబడి నాగేశ్వరరావుపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో నాగేశ్వరరావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలోఉన్న నిందితుడు సురేంద్ర కోసం ముమ్మరం గాలింపు చేపట్టారు. (చదవండి: రౌడీషీటర్‌ షానూర్‌పై హత్యాయత్నం)

Advertisement
 
Advertisement
Advertisement