దుకాణం వద్దకు వచ్చిన యువతి పట్ల అసభ్య ప్రవర్తన..

Rowdy Sheeter Assasinate Tragedy In Karnataka - Sakshi

సాక్షి, బనశంకరి(కర్ణాటక): రౌడీషీటర్‌ను దుండగులు మారణాయుధాలతో దాడిచేసి హతమార్చారు. ఈ ఘటన దేవరజీవనహళ్లి (డీజే.హళ్లి) పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. డీజే.హళ్లి ఇందిరా క్యాంటీన్‌ రోడ్డు సమీపంలో రౌడీ మజర్‌ (45) నివాసం ఉంటున్నాడు. శనివారం ఉదయం బయటకు వచ్చిన మజర్‌ ఓ దుకాణం వద్దకు వచ్చిన యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. యువతి ప్రతిఘటించింది. కోపోద్రిక్తులైన ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కొడవలితో మజర్‌పై దాడి చేసి ఉడాయించారు.

తీవ్ర రక్తస్రావంతో ఉన్న మజర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. డీజే హళ్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. అతని ప్రత్యర్థులే పథకం పన్ని హత్యకు పాల్పడ్డారనే అనుమానం వ్యక్తమవుతోంది. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top