గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం..8 మంది అరెస్టు | Prostitution: Police Raid On Hotels In Adilabad | Sakshi
Sakshi News home page

లాడ్జీలో వ్యభిచారం.. 8 మంది అరెస్టు

Nov 24 2021 4:33 PM | Updated on Nov 24 2021 8:39 PM

Prostitution: Police Raid On Hotels In Adilabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నిర్మల్: జిల్లా కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్న వారిని పోలీసులు పట్టుకొని గుట్టురట్టు చేశారు. శివాజీచౌక్‌లో ఓ ఫంక్షన్‌ పక్కనే గల లాడ్జీపై పట్టణ సీఐ శ్రీనివాస్, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసుల ఆధ్వర్యంలో సంయుక్తంగా మంగళవారం దాడి నిర్వహించారు.

వ్యభిచారం చేస్తున్న 8 మంది విటులతోపాటు యువతులను పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకోని విచారణ నిమిత్తం పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే సంబంధిత లాడ్జీ యజమాన్యంపై కేసు నమోదు చేశారు. విషయమై పట్టణ సీఐ వివరణ కోరగా త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.    

Advertisement
 
Advertisement
Advertisement